భారత్‌పై అమెరికా 50 శాతం మేర సుంకాల విధింపు, వాటిని మరింత పెంచుతామన్న హెచ్చరికలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా పేర్కొంది. వాణిజ్య, సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని చైనా ఆరోపించింది. ఢిల్లీలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. భారత్- చైనా సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతున్న తరుణంలో.. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.