TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(M) మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని కదిలిస్తుంటే ఒళ్లు గగుర్పొడిచే విషయాలు బయటపడుతున్నాయి. మృత్యువు అంచుల వరకు వెళ్ళి వచ్చినట్లుగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 'సీటు కోసం కండక్టర్ తో మాట్లాతుండగా టిప్పర్ డికొట్టింది. క్షణాల్లో అంతా జరిగిపోయింది. కంకరలో కూరుకుపోయా .. ఇక నా ప్రాణం పోవడం కాయమనుకున్నా. కాపాడాలని వేడుకున్నా ఫలితం లేదు' అని నిమ్స్ లో చికిత్స పొందుతున్న జయసుధ అనే మహిళ తెలిపింది.