రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. "భారతదేశానికి ఎక్కడ బెస్ట్ డీల్ లభిస్తుందో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంటుంది. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా చమురు కొనుగోలుకు చర్యలు తీసుకుంటుంది" అని రష్యా మీడియాతో వినయ్ కుమార్ అన్నారు.