'మా డిమాండ్లు నెరవేర్చేవరకు బంద్ కొనసాగిస్తాం'

TG: తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు బంద్ కొనసాగిస్తామని తెలంగాణ ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య అధ్యక్షుడు రమేశ్ బాబు స్పష్టం చేశారు. HYDలో మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యల పరిష్కారానికి కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నాం. మూడు నెలలకు బదులు ఒక నెలలోనే కమిటీ రిపోర్టు అడగాలి. మార్చి నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి. ఈ డిమాండ్లను పరిష్కరించకపోకపోతే 10లక్షల మంది విద్యార్థులతో భారీ సభ నిర్వహిస్తాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్