కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతాం: కేటీఆర్‌

TG: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట సమత కాలనీలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, BRS మైనారిటీ నేతలతో కలిసి KTR పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ‘కాంగ్రెస్ బకాయి కార్డు’లను ప్రజలకు అందించి, కాంగ్రెస్ మోసపూరిత పాలనను వివరించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్