తుఫాన్ బాధితులను ఆదుకుంటాం: CM రేవంత్

TG: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. మొంథా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని సీఎం ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే వరదసాయం అంశాలపై సీఎం చర్చించారు. శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్