అహ్మదాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. “పహల్గామ్ దాడికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నామో ప్రపంచం చూసింది. ఉగ్రవాదులు, వారి యజమానులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రస్తావిస్తూ భారత్ శక్తివంతమవుతోందని తెలిపారు. శ్రీకృష్ణుడు– గాంధీ చూపిన మార్గంలో దేశం ముందుకు సాగుతోందని అన్నారు.