టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్‌నకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా ఖండంలోని అత్యుత్తమ జట్లతో ఆడటం ఛాలెంజింగ్‌గా ఉందన్నాడు. పాక్‌తో జరిగే మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ఎప్పుడూ దూకుడుగానే ఉంటుందని, దూకుడు లేకుండా బరిలోకి అడుగుపెట్టలేమన్నాడు. యూఏఈ జట్టు క్రికెటర్లు సైతం ఉత్తేజకరంగా ఆడుతున్నారని.. ఆసియా కప్‌లో వాళ్లు మరింత రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.