వెబ్‌సిరీస్‌ వివాదం.. రెడ్‌ చిల్లీస్‌, నెట్‌ఫ్లిక్స్‌కు దిల్లీ హైకోర్టు సమన్లు

'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌పై మాజీ ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టులో దావా దాఖలు చేశారు. దీనిపై కోర్టు నెట్‌ఫ్లిక్స్‌, రెడ్‌ చిల్లీస్‌కు సమన్లు జారీ చేసి, విచారణను అక్టోబర్‌ 30కి వాయిదా వేసింది. సిరీస్‌లో తనను, ఎన్‌సీబీని నెగెటివ్‌గా చూపించారని వాంఖడే పేర్కొన్నారు. పరువు నష్టం కేసులో రూ.2 కోట్లు పరిహారం డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్