భారతీయ వివాహాల సంప్రదాయాలు, సంగీతం, నృత్యం వంటి వేడుకలు ఇప్పుడు ప్రపంచ నగరాల్లోనూ కనిపిస్తున్నాయి. ఇటీవల న్యూయార్క్ నగరంలో ఒక భారతీయ జంట తమ వివాహ ఊరేగింపును వీధుల్లోకి తీసుకువచ్చారు. అతిథులు సంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.