ఆసియా కప్ ఫైనల్ భారత్-పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా జరుగుతోంది. భారత స్పిన్నర్ల ధాటికి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 146 పరుగులకు పాకిస్తాన్ ఆలౌట్ అయింది. భారత్ లక్ష్యం 147 పరుగులు. కేవలం మూడు ఓవర్ల వ్యవధిలోనే ఫకర్ జమాన్(46), తలాత్(1), సల్మాన్ అఘా(8), షహీన్ అఫ్రిది(0), అష్రాఫ్(0) పెవిలియన్ బాట పట్టారు. కుల్దీప్ యాదవ్ నాలుగు, బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు.