TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. షేక్‌పేట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ ఒకటేనని, బీఆర్ఎస్ ముస్లింలను మోసం చేస్తోందని ఆరోపించారు.