AP: మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? ఏపీ, తెలంగాణలో ఎవరి శక్తిమేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. "సముద్రంలో కలిసే నీటి వాడకంపై వివాదం నెలకొల్పడం ఎంత వరకు సమంజసం? గోదావరిలో నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులే." అని చంద్రబాబు వెల్లడించారు.