దేశంలోనే మొట్టమొదటి విడాకులు తీసుకున్న హిందూ మహిళ రుఖ్మాబాయి రౌత్. ఆమెకు 11 ఏళ్లకే పెళ్లి చేశారు. చదువుకోవాలనే ఉద్దేశంతో బాల్య వివాహాన్ని తిరస్కరించి విడాకుల కోసం పోరాడింది. ఈ విడాకుల కేసులో స్వయంగా బ్రిటన్ క్వీన్ జోక్యం చేసుకుని ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసింది. విడాకులు తీసుకున్నాక ఇంగ్లండ్‌లో వైద్య విద్యనభ్యసించి దేశంలోనే మొదటి మహిళా డాక్టర్‌గా నిలిచింది. రుఖ్మాబాయి రౌత్ జీవితం ప్రతి మహిళకు ఆదర్శమే.