హడావిడిగా బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేయడం ఎందుకు: హైకోర్ట్

బీసీలకు 42% రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగా జీవో ఎలా విడుదల చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని.. హడావిడిగా బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేయడం ఎందుకు అని ఏజీని హైకోర్ట్ ప్రశ్నించింది. మరో మూడు నెలలు సమయం పడుతుందని హైకోర్టులో మెమో వేయవచ్చు కదా అని ఏజీకి సూచించింది.

సంబంధిత పోస్ట్