TG: భర్తను భార్య సుత్తితో కొట్టి చంపింది. ఈ ఘటన హైదరాబాద్ బోరబండలో జరిగింది. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం భర్తను భార్య సుత్తితో విచక్షణారహితంగా కొట్టి చంపేసింది. స్థానికుల సమాచారంతో బోరబండ పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.