కర్ణాటకలోని హున్సూర్ గ్రామానికి చెందిన సల్లపురి అనే మహిళ తన భర్త వెంకటస్వామిని విషం పెట్టి చంపి, పులి దాడిలో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చే రూ.15 లక్షల పరిహారం పొందాలనే దురుద్దేశంతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది. వెంకటస్వామి మృతదేహాన్ని ఇంటి వెనుక గుంతలో నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పులి సంచారం గురించి గ్రామంలో వస్తున్న పుకార్లను ఆసరాగా చేసుకుని ఈ కుట్ర పన్నింది.