మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్‌లో షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ కొనివ్వలేదని ఓ భార్య తన భర్త కాళ్లు విరగొట్టింది. శివం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అయితే భార్య లగ్జరీ వస్తువుల కోసం తరుచు గొడవ పడేది. ఈ క్రమంలోనే తాజాగా ఐఫోన్ కావాలని పట్టుబట్టింది. భర్త దానికి ఒప్పుకోకపోవడంతో గొడవ పడి మేడపైకి తీసుకెళ్లి కిందకు తోసేసింది. దీంతో శివంకు రెండు కాళ్లు విరిగాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది.