బెంగళూరులో భర్త రాజేంద్రను హత్య చేయించేందుకు భార్య సంగీత చేసిన ప్లాన్ విఫలమైంది. ఈ కుట్రలో ఆమె సోదరుడు, అతని స్నేహితులు, ఒక బాలుడు కూడా పాల్గొన్నారు. అక్టోబరు 25న సాయంత్రం, సంగీత భర్తను ముడా లేఅవుట్ వద్దకు తీసుకెళ్లగా, అక్కడ కారులో ఉన్న సంజయ్, మిగిలిన ఇద్దరు రాజేంద్రపై దాడి చేశారు. విఘ్నేశ్ కత్తితో రాజేంద్ర కడుపులో పొడిచారు. అటుగా వాహనాలు రావడంతో నిందితులు పరారయ్యారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, సంగీత, ఆమె సోదరుడు, ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు.