అంతర్జాతీయ కారణాలతో బంగారం, వెండి ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే వెండి దాదాపు 30 శాతం పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రానున్న 3 ఏళ్ల కిలో వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకుంటుందని అంచనా. వెండిని సౌరశక్తి, విద్యుత్ వాహనాలు, 5జీ టెక్నాలజీలో ఉపయోగిస్తుండడంతో డిమాండ్ పెరిగిందంటున్నారు. రాబోయే 12 నుంచి 24 నెలల్లో వెండి ధరలు 15 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.