వయసు పెరిగే కొద్దీ ముడతలు పడడం సహజమే. అయితే కొంతమందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా నుదుటి మీద కనిపించే గీతల కారణంగా చాలామంది అసౌకర్యంగా ఫీలవుతుంటారు. దీన్నే ‘ప్రిమెచ్యూర్ రింకిల్స్’ అంటారు. ఇది అదుపులో ఉండాలంటే శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి. ఎండలోకి వెళ్ళేముందు సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. ఒత్తిడి, మానసిక ఆందోళనలను అదుపులో పెట్టుకోవాలి.