యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. మోడీనగర్ తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిపై పోలీసులు సరైన చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తూ శుక్రవారం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవాలని ప్రయత్నించింది. అయితే అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని ఆమె చేతిలోని లైటర్ లాక్కొని ప్రాణాపాయం నుంచి తప్పించారు.