గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఆమ్రపాలి గోల్ఫ్ హోమ్స్ సొసైటీలో దారుణం జరిగింది. ఎగ్జిట్ గేట్ ద్వారా కారు లోపలికి తీసుకురావడాన్ని ప్రశ్నించిన ఒక మహిళపై గార్డులు దాడి చేశారు. తోటి నివాసికి మద్దతుగా వచ్చిన ఆ మహిళను గార్డులు కొట్టడం, తోయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ ఘర్షణ తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సొసైటీలో గార్డుల తీరు పట్ల నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.