బట్టలు ఐరన్ చేస్తుండగా.. షాక్ కొట్టి మహిళ మృతి

TG: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని అప్పంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేస్తుండగా ఐరన్ బాక్స్ షార్ట్ సర్క్యూట్ అవడంతో సంజనోల్ల అనంతమ్మ(57) అనే మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందారు. భర్త బాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతమ్మకు ముగ్గురు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్