TG: కళ్ల ముందే భార్య చనిపోవడంతో భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది. అచ్చంపేట మండలం అక్కారం తండాకు చెందిన బాలు భార్య కళ (35) జ్వరంతో బాధపడుతుండగా శుక్రవారం బైక్‌పై కల్వకుర్తిలో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా కళ్లు తిరిగి కళ రోడ్డుపై పడిపోయింది. 108 సిబ్బంది ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. రోడ్డు పక్కన భార్యను ఒడిలో పెట్టుకోని భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యం అందరినీ కలచివేసింది. కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.