TG: స్కూటీ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఖమ్మంలోని మమత రోడ్ ట్యాంక్‌బండ్ సమీపంలో జరిగింది. అనుమోలు కిరణ్మయి(34) అనే మహిళ స్కూటీపై తన ఇద్దరు పిల్లలతో కలిసి ట్యాంక్‌బండ్ నుంచి ఇందిరానగర్ వైపు వెళ్తుంది. ఈ క్రమంలో స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఎగిరి రోడ్డుపై పడిపోయారు. కిరణ్మయి అక్కడిక్కడే చనిపోగా.. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.