ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా హృదయవిదారక ఘటన జరిగింది. ఒక ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీని ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించారు. సరైన సమయంలో వైద్య సహాయం అందకపోవడం వల్ల ఆమె ఆసుపత్రి ఫ్లోర్‌పైనే నొప్పులతో తల్లడిల్లుతూ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.