యూపీ, బులంద్‌షహర్ జిల్లాలోని నరోరాలో దారుణ ఘటన జరిగింది. సీమా అనే మహిళ, తన ప్రియుడు యతేంద్రతో కలిసి మూడేళ్ల కుమార్తె దివ్యాంశిని చంపేసింది. తమ వివాహేతర సంబంధానికి.. ఆ చిన్నారి అడ్డంకిగా ఉందని భావించి.. బాలికను చంపేసి కాలువలో పడేశారు. అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు, చిన్నారి కిడ్నాప్ అయినట్లుగా పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. చివరికి.. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది.