పిల్లోడిని ఎత్తుకుని ఫైర్ బాటిళ్ల‌తో మ‌హిళా విన్యాసాలు.. వీడియో

మహారాష్ట్ర పుణెలో బార్‌టెండర్‌ కవిత మెదార్‌ చేసిన స్టంట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. దుర్గానవరాత్రి ఈవెంట్‌లో చిన్న పిల్లోడిని ఎత్తుకుని ఫైర్‌ బాటిళ్లతో విన్యాసాలు చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసించగా, మ‌రికొంద‌రు ఆమె వ్య‌వ‌హ‌రించిన తీరును ఖండించారు. చంక‌లో పిల్లోడు ఉన్న స‌మ‌యంలో.. ఫైర్ బాటిళ్ల‌తో ఆట‌లేంట‌ని కొంద‌రు ప్ర‌శ్నించారు. కవిత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్