యూపీ మీరట్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంజిత్‌పురి కాలనీలో దారుణం జరిగింది. ఓ మహిళ ఆలయానికి వెళ్తుండగా ఇద్దరు బైక్ దొంగలు కేవలం 3 సెకన్లలోనే ఆమె మెడలోని గొలుసు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డైంది. దొంగిలించిన గొలుసు విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.