మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో తన సోదరి కుమారుడి స్కూల్ ఫీజు కోసం ఓ మహిళ(24) ఏటీఎంలో చోరీకి యత్నించింది. తన సోదరి కుమారుడు 11వ తరగతి చదువుతున్నాడు. ఫీజు చెల్లించని కారణంగా అతడిని స్కూల్‌కు రానివ్వట్లేరు. దీంతో ఎవరూ లేని సమయంలో అతడిని వెంట పెట్టుకుని ఓ ఏటీఎంలో చోరీకి యత్నించింది. నగదు ఉన్న పెట్టెను తెరిచేందుకు విఫలయత్నం చేసింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి బాలుడిని కరెక్షన్ హోంకు తరలించారు.