మహిళల వన్డే ప్రపంచ కప్.. భారత్‌పై సౌతాఫ్రికా విజయం

మహిళల వన్డే ప్రపంచ కప్‌ 2025లో భారత్‌కు తొలి ఓటమిపాలైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాపై సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలిచింది. రిచా ఘోష్‌ (94) మెరవడంతో తొలుత భారత్ 251 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని సఫారీలు 7 వికెట్లు కోల్పోయి 48.5 ఓవర్లలో ఛేదించారు. డిక్లర్క్ (84*), వొల్వార్ట్ (70), ట్రైయాన్ (49) రాణించారు. భారత బౌలర్లలో క్రాంతి 2, స్నేహ్ 2, అమన్‌జ్యోత్, చరణి, దీప్తి ఒక్కో వికెట్ పడగొట్టారు.

సంబంధిత పోస్ట్