మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందే వర్షం ఆటంకం కలిగించింది. ఆదివారం మధ్యాహ్నం నవీముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మొదలవల్సిన ఈ ఆటలో ఇంకా టాస్ పడలేదు. ప్రస్తుతం అక్కడ భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ కు ఆలస్యం కానుంది.