Women's WC: విశాఖలో భారత్-ఆసీస్ పోరు

AP: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన అన్ని టికెట్లు అమ్ముడైపోయాయి. భారత జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు రెండు విజయాలతో పాటు, శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్లను పంచుకుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాపై గెలవాలంటే భారత జట్టు సత్తా చాటాల్సిన అవసరం ఉంది.

సంబంధిత పోస్ట్