బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జిఓ 9 విడుదల చేయడం పట్ల బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆదివారం మోత్కూరులో హర్షం వ్యక్తం చేశారు. గత 5 దశాబ్దాలుగా బీసీ రిజర్వేషన్లపై దేశంలో అనేక ఆందోళనలు జరుగుతున్నప్పటికీ, గత ప్రభుత్వాలు బీసీలను రాజకీయంగా వాడుకున్నాయని ఆయన అన్నారు.