పశువుల దావాఖానలో మందుబాబుల సిట్టింగ్

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చల్లూరు గ్రామంలోని పశువుల దావాఖానలో మందు గ్లాసులు, వాటర్ బాటిల్, ఇస్తారాకులు కనిపించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో తెలియని వ్యక్తులు ఈ పని చేశారని, ఇది పశువుల ఆరోగ్య కేంద్రమని గుర్తుంచుకోవాలని వారు కోరారు. ఈ సంఘటనపై గ్రామస్తులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మందుబాబుల్లో మార్పు రావాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్