కార్తీక మాసం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. కల్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు రద్దీగా మారాయి. స్వామివారి దర్శనానికి 3 గంటలకు పైగా పడుతుంది. స్పెషల్ దర్శనానికి గంట సమయం పడుతోంది.