యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురంలో కొలువైన మత్స్యగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆలయ మహాముఖ మండపంలో విష్వక్సేన ఆళ్వారుడిని కొలుస్తూ తొలి పూజలు నిర్వహించారు. పూజా జలంతో ఆలయం, మాఢవీధులు, మండపాలను శుద్ధి చేశారు. రాత్రి వేళ పుట్ట మట్టి తెచ్చి నవ ధాన్యాలు నాటి, ఉత్సవాలకు అంకురార్పణ జరిపారు.