చౌటుప్పల్: లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ చెరువు అలుగు పోయడంతో ప్రభుత్వ కార్యాలయాలు, సర్వీస్ రోడ్లు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం ఆ ప్రాంతాలను పర్యటించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిఎంఆర్ అధికారులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా డ్రైనేజీలు నిర్మాణం చేయడమే అలుగునీరు సర్వీస్ రోడ్లపై ప్రవహించడానికి కారణమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్