యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారంలోని వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ కళాశాలలో స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్, కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అవేస్ ఉర్ రెహమాన్ చిస్తి పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.