ముక్కోటి పర్వదినం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం

యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్