యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిల్లయిపల్లి గ్రామంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటించారు. సప్తపరిమి ఫౌండషన్ ఆధ్వర్యంలో అంధ విద్యార్థుల కోసం బ్రెయిన్ లిపిలో రచించిన హనుమాన్ చాలీసా, భగవద్గీత పుస్తకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, అంధ విద్యార్థుల అభ్యున్నతికి ఫౌండషన్ చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు.