రామన్నపేట: రైల్వే అండర్ బ్రిడ్జిలతో జనం తంటాలు

రామన్నపేటలోని రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిస్తే బ్రిడ్జిల్లో మోకాళ్ల లోతు నీరు చేరి స్కూల్ బస్సులు, వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ఇటీవల తుపాను సమయంలో సిరిపురం, కొమ్మాయిగూడెం బ్రిడ్జిల్లో నీరు నిలిచిపోవడంతో ధాన్యం లారీ పాడైంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బీఎస్పీ నాయకులు గూని రాజు, నకిరేకంటి నరేష్, జినుక గోవర్ధన్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్