థాయ్‌లాండ్ మాజీ ప్రధాని థక్సిన్ షినవత్రకు మరోసారి ఆ దేశ సుప్రీంకోర్టు శిక్ష విధించింది. గతంలో విధించిన జైలు శిక్షను సరిగా అనుభవించలేదని, ఏడాది పాటు జైలులో ఉండాలని ఆదేశించింది. 2008లో ఓ కేసులో శిక్ష పడడంతో విదేశాలకు పారిపోయి, 15 ఏళ్ల తర్వాత 2023లో తిరిగి వచ్చారు. అప్పట్లో 8 ఏళ్ల శిక్ష పడినా, దాన్ని ఏడాదికి తగ్గించారు. కానీ ఆరోగ్యం పేరుతో జైలుకు వెళ్లకపోవడంతో అనుమానాలు రేకెత్తాయి. తాజాగా కోర్టు మరోసారి శిక్ష విధించింది.