కర్ణాటకలోని బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. ఓ లాడ్జిలో 20 ఏళ్ల తక్షిత్ శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన అతడు అక్టోబర్ 9 నుంచి ఆ లాడ్జిలో గదిలో తన ప్రేయసితో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆహారం తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి వీరిద్దరూ మాత్రలు తెచ్చుకున్నారు. కాసేపటి తర్వాత అతడి ప్రియురాలు లాడ్జి నుండి వెళ్లిపోగా, తక్షిత్ గదిలో శవమై కనిపించాడు.