బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లోని ఒక పబ్‌లో గురువారం రాత్రి 31 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ మేఘరాజ్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్నేహితులతో కలిసి భోజనం చేసిన తర్వాత వాష్‌రూమ్‌కి వెళ్లి తలుపు లాక్ చేసుకున్నాడు. చాలాసేపటికి బయటకు రాకపోవడంతో సిబ్బంది తలుపు పగలగొట్టి చూడగా అతను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నివేదిక తర్వాతే మరణానికి కారణం తెలుస్తుందని తెలిపారు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు.