ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

TG: మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకొని మతిస్థిమితం లేని ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. జీవంచి పల్లి గ్రామానికి చెందిన బండారి అనూష(22) అనే యువతి గత కొంత కాలంగా మతిస్థిమితం సరిగా లేక అనారోగ్య కారణాలతో బాధ పడుతూ ఉంది. జీవితంపై విరక్తి చెందిన యువతి ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్