ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య (వీడియో)

AP: నెల్లూరు (D), దుత్తలూరు (M) వెంకటంపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పఠాన్ సనా (17) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సనా దుత్తలూరు మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతుండగా ఇటీవల తల్లిదండ్రులు చదువు మాన్పించేశారు. ఈ క్రమంలో గురువారం పేరెంట్స్ చికిత్స కోసం ఉదయగిరికి వెళ్లారు. వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె విగత జీవిగా పడి ఉంది. సనా మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్