చిత్తూరులో యువతిపై సామూహిక అత్యాచారం

AP: చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. నగరవనంలో ఓ ప్రేమ జంట కూర్చొని ఉండగా.. వారితో హేమంత్, మహేశ్, కిషోర్ అనే ముగ్గురు ఫారెస్ట్ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. ఆ ప్రేమ జంట వీడియో, ఫోటోలు తీసి బెదిరించారు. యువకుడిని బెదిరించి.. ముగ్గురూ కలిసి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. విషయం తెలిసి యువతి గ్రామస్థులు నిందితుల్ని దేహశుద్ధి చేయగా.. ఒకడు తప్పించుకున్నాడు. మిగిలిన ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుల్లో కిశోర్, మహేశ్ టీడీపీ కార్యకర్తలని వైసీపీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్