'మీ అబ్బాయికి ప్రమాదం జరిగింది'.. రూ.35 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

సైబర్‌ నేరగాళ్లు లండన్‌లో కుమారుడికి ప్రమాదం జరిగిందని నమ్మించి హైదరాబాద్‌కు చెందిన ఒక వృద్ధురాలిని రూ.35.23 లక్షలు మోసం చేశారు. స్టీవ్‌ అనే వ్యక్తి డాక్టర్‌గా పరిచయం చేసుకుని, లండన్‌ ఎయిర్‌పోర్టులో ప్రమాదం జరిగిందని, కుమారుడికి గాయాలయ్యాయని చెప్పాడు. ఐడెంటిటీ లేదని, ఆసుపత్రిలో చేర్చుకోవటం లేదని నమ్మించి, చికిత్స కోసం డబ్బులు పంపించమని కోరాడు. అనుమానం వచ్చిన వృద్ధురాలు తన కుమారుడిని సంప్రదించగా, తాను క్షేమంగా ఉన్నానని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్